![]() |
![]() |

కాకమ్మ కథలు సీజన్ 2 బాగా ఫన్నీగా సాగుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కి దీపికా - చెఫ్ సంజయ్ తుమ్మల వచ్చారు. ఎపిసోడ్ 2 కి శేఖర్ మాష్టర్ - ముమైత్ ఖాన్ వచ్చారు. ఇప్పుడు ఎపిసోడ్ 3 సాకేత్ కొమాండూరి - పర్ణికని తీసుకొచ్చింది. వీళ్ళు సింగర్స్. వీళ్ళతో రిలీజ్ ఐన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సాకేత్ ని కొన్ని ప్రశ్నలు అడిగింది హోస్ట్ తేజస్విని మడివాడ. సింగర్ సాకేత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో కూడా చేస్తున్నాడు. చాలా ఫన్నీగ ఉంటాడు. అలాగే కామెడీ యాంగిల్ కూడా ఎక్కువగా.
ఐతే ఇందులో తేజు కొన్ని ప్రశ్నలు వేసింది సాకేత్ ని. "నీ లైఫ్ లో లోపాయింట్ గురించి చెప్పు" అని అడిగేసరికి. "చాలా నమ్మిన ఒక వ్యక్తి సొంత తమ్ముడిలా చూసుకున్న ఒక వ్యక్తి ఓవర్ నైట్ జంప్ ఐపోయాడు. ఇంకా చెప్పాలంటే అతను నన్ను వాడుకున్నాడు." అదే ప్రశ్నకు పర్ణిక కూడా రియాక్ట్ అయ్యింది.."తన ప్రెగ్నెన్సీ టైంలో తన వాయిస్ ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అని అప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పింది...చాలా ట్రెయిట్మెంట్స్ కూడా తీసుకున్నాను అని అంది". ఆ తర్వాత కొన్ని కొంటె ప్రశ్నలు అడిగింది.."పాటలు తక్కువ మాటలు ఎక్కువ" అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని పర్ణికను అడిగింది.."సాకేత్" అని ఆన్సర్ ఇచ్చింది. "స్వరం తక్కువ సోకులెక్కువ" ఎవరు అని సాకేత్ ని అడిగింది. "రేవంత్" అని చెప్పాడు. "ఏ హీరోయిన్ తో వీడియో సాంగ్ లో చేయాలనిపిస్తుంది" అని అడిగింది. దానికి సాకేత్ "తమన్నా" అని చెప్పాడు. "మోస్ట్ ఓవర్ రేటెడ్ సింగర్ ఎవరని నువ్వు అనుకుంటున్నావు" అని అడిగింది. "సిద్ శ్రీరామ్" అని చెప్పాడు సాకేత్.
![]() |
![]() |